పీవీ సింధు, ఉపాసనకు అరుదైన గౌరవం
ఫోర్బ్స్ ఇండియా తొలిసారి ప్రకటించిన టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసనకు చోటు దక్కింది. వ్యాపారం, చిత్ర, క్రీడా రంగాల్లో 22 మంది యువ విజేతలతో రూపొందించిన ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. సాధారణంగా ఫోర్బ్స్ మేగజీన్ ఏటా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేస్తుంటుంది. టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాను ప్రత్యేకంగా భారత్కు మాత్రమే రూపొందించినట్లు తెలిపింది. ఇది కేవలం వారి నికర సంపదను మాత్రమే పరిగణలోకి తీసుకొని రూపొందించలేదని పేర్కొంది. ఈ జాబితాలో వ్యాపార రంగం నుంచి అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్, ప్రముఖ సినీ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసనకు చోటు దక్కింది.













