మన్మోహన్ కు పీవీ జీవన సాఫల్య పురస్కారం
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు పేరిట ఇండియా నెక్ట్స్ సంస్థ జీవన సాఫల పురస్కాన్ని 2018 సంవత్సరానికి గాను మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు ప్రదానం చేసింది. దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా మన్మోహన్ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంస్థ నేతృత్వంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ నిపుణులు డాక్టర్ సుభాష్ కశ్వప్, సీబీసీ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, మాజీ ప్రధాని సలహాదారు నరేంద్ర, లోక్సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరలతో కూడిన జ్యూరీ మన్మోహన్ సింగ్ను ఈ అవార్డుతో ఎంపిక చేసింది.













