కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక?
కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేతికి రావడం తధ్యమైన నేపథ్యంలో ఆయన సోదరి ప్రియాంక ఎలాంటి పాత్ర పోషించనున్నారు. భవిష్యత్తులో ప్రియాంక పోషించే పాత్రపై రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. రాయబరేలి, అమేఠీలలో ప్రచార బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రియాంక క్రియాశీలక రాజకీయాలలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. యూపీ ఎన్నికలలో కాంగ్రెస్ మట్టికరవడం, రాహుల్ పదోన్నతికి బ్రేక్ రావడంతో ప్రియాంక గురించి జనాలు తాత్కాలికంగా మర్చిపోయారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందే ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించవచ్చని చెబుతున్నారు.













