సంచలన నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీని నేడో రేపో నియమిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ, ఆయన కన్నా, ప్రియాంకా గాంధీ అయితే బాగుంటుందని సోనియా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె కొందరు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాగా, మన్మోహన్ సింగ్ తదితర పెద్దల ముందు సోనియా స్వయంగా ప్రియాంకా పేరు ఎత్తినట్లు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తావన ఆమె నోటీ నుంచి రాగా, సీనియర్ నేతలు అశ్చర్యపోయారని, తుది నిర్ణయం తీసుకోకున్నా, రాహుల్ కన్నా ప్రియాంకా గాంధీ అయితే, పార్టీకి మేలు కలుగుతుందన్న అభిప్రాయం ఆమెలో వ్యక్తమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.













