ప్రెసిడెంట్స్ లేడీ పుస్తకావిష్కరణ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య, దివంగత సుభ్రా ముఖర్జీ సంగీతం, చిత్రకళ పట్ల చాలా మక్కువ చూపేవారని, రవీంద్రనాథ్ టాగూర్ విరచిత గీతాలను బెంగాలీయేతర రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేశారని వక్తలు కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ, సుభ్రా ముఖర్జీల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్స్ లేడీ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్ర పతి హమిద్ అన్సారీ ఆవిష్కరించగా తొలి ప్రతిని ప్రణబ్ ముఖర్జీ అందుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ సుభ్ర ముఖర్జీ రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రముఖ నేతలందరూ ఆమెకు సుపరిచితులేనని అన్నారు. పుస్తక రచయిత సంగీతా ఘోష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హమిద్ అన్సారీ మాట్లాడుతూ ప్రణబ్‌కు ఆమె ఆత్మబంధువని పేర్కొన్నారు.













