కేజ్రీవాల్ కు రాష్ట్రపతి షాక్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆయన 2015 మార్చి 13న నియమించిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రద్దు చేశారు. వీరిలో రాష్ట్ర మంత్రి కైలాస్ గెహ్లాట్ కూడా ఉన్నారు. లాభదాయక పదవులు అనుభవిస్తున్న వీరిని శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) చేసిన సిఫారసు రాష్ట్రపతి ఆమోదించారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రజాధనాన్ని కాపాడుతున్న తమను ఇబ్బంది పెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.













