రాష్ట్రపతి ఎన్నికల బరిలో అంబేద్కర్ మనుమడు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్‌ను బరిలో నిలిపేందుకు లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు సీపీఐ (ఎం) ప్రధాన క్యాదర్శి సీతారం ఏచూరీ కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, అభిప్రాయలు తీసుకుంటున్నారని ఓ సీనియర్ నాయకడు తెలిపారు. ఈ ఎన్నికలో తమకు గెలుపోటములు ముఖ్యంకాదని, ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థిపై పోటీకి నిలబడితేనే ప్రతిపక్షాల బలం తెలుస్తుందని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతోపాటు ఎన్డీయే యేతర 18 పార్టీల సీనియర్ నాయకులు సమావేశం కానున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ రామ్‌నాథ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 63 ఏండ్ల ప్రకాశ్ అంబేద్కర్ భరిప్ బహుజన్ మహాసంఘ్ పార్టీగా కొనసాగుతున్నారు.













