అధ్యక్ష బరిలో శృంగారతార
రష్యన్ శృంగారతార ఎలెనొ బెరొకవా ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది రష్యన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆమె పోటీ చేయనున్నారు. ఈ సదర్భంగా ఎలెనా ఇన్‌స్టామ్‌గ్రామ్ వేదికగా తాను ప్రెసిడెంట్ పదవి చేపడితే సెక్సువల్ హరాస్మెంట్కు ఉరి శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తానని పేర్కొన్నారు. హార్వీ విన్స్టన్ లాంటి వాళ్లను చూసిన తరువాత తాను ఉరి శిక్షను విధించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ఎలెనా తెలిపారు. అంతేగాక 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న స్కర్టలపై కూడా నిషేధం విధిస్తానన్నారు. అలాగే స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెడతానని ఆమె ప్రకటించారు. వీటితో పాటు విడాకులు తీసుకోవడం అసాధ్యమయ్యేలా నిబంధనలు సడలించనున్నట్లు చెప్పుకొచ్చారు.













