మోదీ మాట్లాడటం నేర్చుకో…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు. తరుచూ మాట్లాడటం నేర్చుకోవాలని గతంలో తనకు ఇచ్చిన సలహానే ఇప్పుడు మోదీ పాటించాలని ఆయన కోరారు. గతంలో నేను మాట్లాడకుంటే మౌన్ మోహన్ సింగ్ అని సంబోధించారు. తరుచూ మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా మోదీ సరిగా స్పందించడం లేదు. అప్పట్లో నాకు ఇచ్చిన సలహానే ఇప్పుడు మోదీ పాటించాలని, తరుచూ మాట్లాడాలని కోరుతున్నా అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. కతువా, ఉన్నావ్ లైంగికదాడి ఘటనలపై మోదీ సూటిగా స్పందిచకపోవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి, తన మద్దతుదారులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు.













