కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు దర్శించుకున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకున్న ఈ ఆలయంలో ప్రధాని మోడీ తొలిపూజ చేశారు. ఈ ఉదయం ఉత్తరాఖండ్ చేరుకున్న మోడీకి ఆ రాష్ట్ర గవర్నర్ కేకే పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కేదార్నాథ్ వెళ్లారు. ఆలయ అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. కేదారేశ్వరుడిని దర్శించుకున్న ప్రధాని తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ఆలంకరించారు.













