ప్రధాని మోదీకి క్లీన్చిట్
గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో 59 మంది కరసేవకులు సజీవ దహనమైన అనంతరం గుజరాత్లో చెలరేగిన అల్లర్లలో నాటి సీఎం నరేంద్ర మోదీకి జస్టిస్ నానావతి కమిషన్ క్లీన్చిట్ ఇచ్చింది. హింసాకాండలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని, కుట్ర లేనే లేదని సృష్టం చేసింది. స్థానికంగా వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు కొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడ్డారని నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల క్రితం కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి ప్రదీప్సిన్హ్ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా, మోదీ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్ కుట్ర పన్నాయని ఈ నివేదికతో తేటతెల్లమైందని బీజేపీ పేర్కొంది.













