రామ్మోహన్నాయుడు వివాహ విందుకి ప్రధాని
తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు వివాహ విందు దేశరాజధానిలో బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్థానిక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై రామ్మోహన్నాయుడు, శ్రావ్యలను ఆశీర్వదించారు. కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ప్రకాశ్ జావడేకర్, సురేశ్ ప్రభు, తోమర్, పీయూష్‌గోయెల్, అకోక్గజపతిరాజ్, సుజనాచౌదరిలతో పాటు టీడీపీ, టీఆర్ఎస్, వైకాపా, బీజేపీ, పలు పార్టీలకు చెందిన వందలాది మంది ఎంపీలు విందుకు హాజరయ్యారు.













