అద్వానీ, జోషిలకు మరొక్క చాన్స్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలోని కురు వృద్ధులు ఎల్కే అద్వానీతోపాటు మురళీమనోహర్ జోషిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు. నిజానికి అమిత్ షా పెట్టిన కొత్త రూల్ ప్రకారం 75 ఏళ్లు మించిన వాళ్లను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా తగులుతున్న షాక్‌లు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైనా, ఆ తర్వాత పార్టీలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అటు జోషికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ ఇద్దరు పార్టీలో అప్రాధాన్య నేతులుగా ఉండిపోయారు. దీంతో పార్టీలోని సీనియర్లతో మోడీ, షా వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే, 2019 ఎన్నికల్లో ఎల్ఏ అడ్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు మురళీ మనోహర్ జోషీ లాంటి అగ్రనేతలను కూడా బీజేపీ బరిలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇటీవలే ప్రధాని మోదీ, అద్వానీని కలిసినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా దీనిపై అగ్ర నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.













