అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ
దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. జైట్లీ నివాసానికి మోదీ చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జైట్లీ భార్య సంగీత జైట్లీ, కుమారుడు, కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రధాని వెంట కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. జైట్లీ హఠాన్మరణ సమయంలో ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో ఉండటంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. దీంతో స్వదేశానికి తిరిగి రాగానే నేరుగా జైట్లీ కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి స్వాంతన పలికారు.













