హిందుత్వ సిద్ధాంతాలతో పరిష్కారం
హిందుత్వ సిద్ధాంతాలతో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సిద్ధాంతాలను ప్రపంచానికి వెల్లడించేందుకు సాంకేతికతను వాడాలన్నారు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్కు మోదీ సందేశం పంపారు. యువతరంతో అనుసంధానం అయ్యేందుకు వివిధ శాస్త్ర గ్రంధాలు, ఇతిహాసాలు, పురాణాలను డిజిటలీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే వచ్చే తరాలకు మనం చేసే గొప్ప సేవ. సాంకేతిక యుగంలో నివసిస్తున్నాం. అందుకే ఈ సదస్సుకు హాజరైన వారంతా హిందుత్వం గొప్పదనాన్ని సాంకేతిక ద్వారా ప్రజలకు చేరవేయాలి అని పిలుపునిచ్చారు.













