నవంబర్ 28న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో వచ్చే నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్-2017)కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్‌తో కలసి మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక, వర్ధమాన వాణిజ్యవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏటా విభిన్న ప్రాంతాల్లో జరిగే ఈ సదస్సు ఈ ఏడాది మహిళా పారిశ్రామికవేత్తలు అనే అంశంపై ప్రధానంగా దృష్టిపెడుతుంది. సదస్సుకు మొత్తం 160 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.













