పూలకు బదులుగా పుస్తకం ఇవ్వండి
పుష్పగుచ్చం బదులుగా పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సాంప్రదాయాన్ని అలవరుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొచ్చిలో పీఎన్ పానికర్ నేషనల్ రీడింగ్ డే సందర్భంగా సెయింట్ థేరిసా కాలేజీ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల చాలా మార్పును తీసుకురావచ్చను అని అన్నారు. పుస్తకాలను చదవడంలో ఉన్న ఆనందం ఎందులో ఉండదన్నారు. జ్ఞానం కన్నా శక్తివంతమైనది ఏదీ లేదన్నారు. అక్షరాస్యతతో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శమన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ కొచ్చి మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.













