ప్రపంచ దేశాధినేతల్లో మోదీ టాప్
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ దేశాల నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన విశ్లేషణ ప్రకారం ఈ నెల 14 నాటికి ప్రధాని మోదీ 68 శాతం రేటింగ్‌తో టాప్ 10 నేతల్లో అగ్రస్థానంలో ఉన్నారు. కాగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 36 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా, 35 శాతం రేటింగ్‌తో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ జాన్ మారిసన్ నాలుగో స్థానంలో, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అయిదో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైనస్ 3 రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తొమ్మిదో స్థానంలో, జపాన్ ప్రధాని షింజో అబే చిట్టచివరి స్థానంలో నిలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్లో ఈ విషయం తెలియజేస్తూ, ఈ సంక్షోభ సమయంలో ప్రధాని పట్ల దేశ ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.













