ప్రవాసుల సమస్యల పరిష్కారానికి కృషి : ప్రధాని
ప్రవాసుల సమస్యల పరిష్కారంలో, విదేశీ వ్యవహారాల్లో భావి దౌత్యవేత్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అత్యాధునిక సాంకేతిక సంపత్తిని అందిపుచ్చుకోవాలని కోరారు. ఇండియన్ ఫారిస్ సర్వీస్‌కు ఎంపికైన శిక్షణ పొందుతున్న 39 మంది ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసుల సమస్యల పరిష్కారం విషయంలో ఆయా దేశాలను అప్రమత్తం చేయడంలో మీ పాత్ర కీలకం. జాతి అభివృద్ధిలో ప్రస్తుత జాతీయ ప్రాధామ్యాలే కాకుండా, భవిష్యత్తు అవసరాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని పేర్కొన్నారు.













