జూన్ వరకు లాక్డౌన్ ?
భారతదేశంలో లాక్డౌన్ కొనసాగింపు దిశగా సాగుతోంది. ఇప్పటికి రెండు విడతలుగా లాక్డౌన్ విధించారు. మూడవ విడత లాక్డౌన్ మే 3 తరువాత కొనసాగించాలని కేంద్రం తీర్మానించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తరువాత కేంద్రం ఆలోచనలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రులతో కూడా పలువురు కేంద్రాన్ని ఇదే విషయం అడిగినట్లుగా సమాచారం. లాక్డౌన్ పొడిగించాలని మెజారిటీ ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఒక్కటే మార్గమని అంటున్నారు. అది కనుక అమలుచేయకపోతే దేశంలో కరోనా కట్టడి కష్టసాధ్యమవుతుందని కూడా పలువురు అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తోంది.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, వారందరి అభిప్రాయాలను స్వీకరించిన తరువాత లాక్ డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే మొగ్గు చూపారని తెలుస్తోంది. అధికార వర్గాల నుంచి అందుదున్న సంకేతాల మేరకు అన్ని నిబంధనలు సడలింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌తో పాటు, తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్డౌన్ పై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. వీరిలో అత్యధిక మంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని, అయితే, నిత్యావసరాలతో పాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని సూచించినట్టు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలనూ తీసుకున్న నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు నగరాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
లాక్డౌన్ కొనసాగించాల్సిన ప్రాంతాలు, గ్రీన్ జోన్ ప్రాంతంలో అనుమతించాల్సిన కార్యకలాపాలు, ప్రజా రవానా ప్రారంభిస్తే, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై నిర్ణయం తీసుకునేముందు, మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసి, కేసుల స్థితిని పరిశీలించాల్సి వుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈసారి లాక్డౌన్ ప్రకటిస్తే అది జూన్ వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులకే మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మేఘలాయ, మిజోరం, పాండిచెర్చి, ఉత్తరాఖండ్, హిమచల్‌ప్రదేశ్, ఒడిస్సా, బీహార్, గుజరాత్, హర్యాన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారు. మిగిలిన ముఖ్యమంత్రులు వారి వారి కార్యాలయాల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కేరళా ముఖ్యమంత్రి మాత్రం తన ప్రధాన కార్యదర్శిని వీడియో కాన్ఫరెన్స్‌లో కూర్చోబెట్టారు.













