డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం
కశ్మీర్ పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం రేగింది. కశ్మీర్ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సృష్టత ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమ్మని ఎలా అడుగుతారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సృష్టం చేశారు.













