కేదార్నాథుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేదార్ నాథ్లో పలు అభివృద్ధి పనులక శంకుస్థాపన చేయనున్నారు. 2013లో సంభవించిన విపత్తులో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్మిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. ఈ సీజన్లో ప్రధాని మోదీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించడం ఇదే రెండోసారి. మే 3న ఆలయ పున:ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. చలికాలంలో ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం నుంచి ఆరునెలల వరకు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు.













