పాన్ లో తండ్రి పేరు తప్పనిసరి కాదు
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తులో తండ్రి పేరు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధనను కేంద్రం సడలించనుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల్లోని 114 సెక్షన్, పాన్ కోసం చేసుకొనే దరఖాస్తు-49ఏ, 49ఏఏల్లో సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 17 లోపు తెలియజేయాలని ప్రజలకు సూచించింది. తల్లి మాత్రమే ఉన్న వారు (సింగిల్ పేరెంట్) ఇకపై దరఖాస్తులో ఆమె పేరు రాస్తే సరిపోయేలా తాజా సవరణ తీసుకొస్తున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. వ్యక్తులు పాన్‌కార్డ్ లేకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.50 లక్షలు, ఆపై లావాదేవీలు చేసినట్లయితే, తదుపరి ఆర్థిక సంవత్సరం మే 31లోపు పాన్ కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ నిబంధనను ప్రతిపాదించారు.













