పౌరులు కూడా విరాళాలివ్వచ్చు….
కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరులో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్థం అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీఎం-కేర్స్ (ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్) ఫండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రకటించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. తక్కువ విరాళాలను కూడా తీసుకుంటామని వెల్లడించారు. విపత్తు నివారణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఆరోగ్యకరమైన, శ్రేయస్కరమైన దేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
పీఎం-కేర్స్ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర సమాచార వెల్లడించింది. ట్రస్ట్ సభ్యుల్లో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా ఉంటారని తెలిపింది. విరాళాలు అందించే వారి కోసం వివరాలు వెల్లడించింది. ఈ కింద ఉన్న వివరాలు ఆధారంగా దాతలు విరాళాలు ఇవ్వొచ్చు.













