ఫాస్టాగ్ లేకుంటే డబుల్ టోల్ వసూలు: గడ్కరీ
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద టాగ్స్ లేకుండా ఫాస్టాగ్ మార్గాల గుండా ప్రయాణించే వాహనాలకు డిసెంబర్ 1 నుంచి డబుల్ టోల్ విధించనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న 537 టోల్ ప్లాజాల వద్ద ఇదేవిధంగా డబుల్ టోల్ వసూలు చేస్తారని ఆయన హెచ్చరించారు. 100 శాతం టోల్ ప్లాజాలను ఎలక్ట్రిక్ పద్దతిలోకి మార్చామని, 17 టోల్ ప్లాజాల వద్ద చేతితోనే ఫాస్టాగ్‌ను అమలు చేయనున్నారని ఆయన వివరించారు. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఎన్ఈటీసీ) పథకం కింద డిసెంబర్ 1 నుంచి టోల్ చెల్లింపులు మొత్తం ఫాస్టాగ్‌ల ద్వారా మాత్రమే జరగనున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్ వసూల్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక హైబ్రీన్ లేన్ ఉంటుంది. ఇదిలావుండగా ఫాస్టాగ్‌ను వాహనం ముందుభాగం అద్దంపై అంటిస్తారు. దీని సహాయంతో అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీల చెల్లింపు జరిగిపోతోంది. వాహనాలు ముందుకు కదిలేందుకు అనుమతి లభిస్తుంది.













