కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి కొండగట్టుకు చేరుకునే మార్గంలో పవన్‌ని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో పలుచోట్ల సందడి వాతావరణం నెలకొంది.
కొండగట్టుకు పవన్ రూ. 11 లక్షల విరాళం
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.11 లక్షల విరాళం ఇచ్చారు. తెలంగాణలో తాను చేపట్టే యాత్ర ప్రారంభానికి ముందుగా పవన్ అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు పవన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కరీంనగర్ చేరుకున్నారు.













