జేడీఎస్ తరపున పవన్ ప్రచారం
ఉత్తర కర్ణాటకలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లుగా జాగ్వార్ హీరో నిఖిల్, హీరోయిన్ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని తెలిపారు.













