త్వరలో జనసేన ప్లీనరీ!
జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ప్లీనరీని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే అంశానికి సంబంధించి పలు ప్రతిపాదనలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చర్చించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనసేన పార్టీ పరిపాలన కార్యాలయంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్లీనరీ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఆరు నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్యమైన కార్యక్రమాలు, జనసేన బలోపేతం కూడా చర్చించారు. వీటితో పాటు సభ్యత్వ నమోదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటనపై కూడా పలు నిర్ణయాలు ప్రకటించారు.













