పాస్పోర్టు దరఖాస్తుల్లో వెసులుబాటు
పాస్పోర్టు దరఖాస్తుల్లో ఇకపై తల్లి, లేదా తండ్రి ఒక్కరి పేరును పేర్కొంటే చాలని పాస్పోర్ట్ కార్యాలయం పేర్కొంది. సాధువులు, సన్యాసులు అయితే, తమ దైవం పేరునే సంబంధిత కాలమ్లో పేర్కొనవచ్చని తెలిపింది. దరఖాస్తుతో పాటు జతపరచాల్సిన ప్రతాల (ఆనెక్షర్స్) సంఖ్యను కూడా 15 నుంచి 2 కి తగ్గించినట్టు వివరించింది. గతంలో ప్రతీ అనెక్షర్లో నోటరీ ఇవ్వాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం వాటి స్థానంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. ఇక అభ్యర్థులు వివాహ ధ్రువీకరణ పత్రం, జీవిత భాగస్వామి పేరును పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ ఈ వెసులుబాట్లను కల్పించినట్లు పేర్కొంది.













