వారికి పాస్‌పోర్టు దరఖాస్తు ఫీజు తగ్గింపు
ఇక నుంచి పాస్‌పోర్టులో వ్యక్తిగత వివరాలను హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ తెలిపారు. పాస్‌పోర్టు చట్టం తీసుకొచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుష్మా మాట్లాడారు. ఎనిమిదేళ్ల వయసు కంటే తక్కువ, 60 సంవత్సరాల పైబడిన దరఖాస్తుదారుల ఫీజును కూడా 10 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాస్‌పోర్టులో వ్యక్తిగత వివరాలను ఆంగ్ల భాషలోనే ముద్రించడం జరుగుతోంది. కొత్త నిబంధనతో ఇకపై హిందీలోనూ ముద్రిస్తారు. 1967లో పాస్‌పోర్టు యాక్ట్‌ను తీసుకొచ్చారని తెలిపారు. కాగా పాస్‌పోర్టులో ప్రకటించే వ్యక్తిగత వివరాలు ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే ముద్రిస్తున్న సంగతి తెలిసిందే.













