కరుణానిధికి అరుదైన గౌరవం
పార్లమెంటు ఉభయ సభలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళులర్పించాయి. అనంతరం లోక్‌సభను స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభను చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యంత అరుదైన, మునుపెన్నడూ జరగని పరిణామం. సంప్రదాయం ప్రకారం పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు మరణించినపుడు మాత్రమే సంతాపం తెలిపి, ఉభయ సభలను వాయిదా వేస్తారు. కానీ కరుణానిధి పార్లమెంటు సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయనను ప్రత్యేకంగా పరిగణించి గౌరవించారు. కరుణానిధి ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాజ్యసభ సభ్యుడిగా కానీ, లోక్‌సభ సభ్యుడిగా కానీ పని చేయలేదు.













