తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట
పంచాయతీరాజ్‌ల అభివృద్ధిలో ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకూ అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్ 12 అవార్డులు దక్కించుకుంటే, తెలంగాణ రాష్ట్రానికి 8 అవార్డులు దక్కాయి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్నోలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులను ప్రదానం చేస్తారు. తాగునీరు, పారిశుద్యం, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించి దేశంలోని 25 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల కింద ఉత్తమ జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 8 నుంచి 10 లక్షల నగదు అందజేస్తారు.













