20 ఏళ్ల నుంచి మోడీకి రాఖీ కడుతున్న పాక్ మహిళ
భారత్, పాక్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితుల్లోనూ ఇరు దేశాల ప్రజలు సామరస్యాన్ని చాటుకుంటున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ 20 ఏళ్లకు పైగా ప్రధానమంత్రి నరంద్రమోదీకి రాఖీ కడుతోంది. మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నప్పటి నుంచీ ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి ఆయనకు రాఖీ కడుతున్నట్లు ఖుమర్ మోసిన్ షేక్ తేలిపింది. మోడీ ప్రధాని అయిన తర్వాత తనకు రాఖీ కట్టే భాగ్యం ఉంటుందో లేదో అని ఆలోచిస్తున్న తరుణంలో పండగకు రెండురోజుల ముందే పీఎంవో ఆఫీస్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని మోసిన్ షైక్ వెల్లడించింది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రాఖీ కట్టించుకునేందుకు తనను ఆహ్వానించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపింది.













