పాక్ కొత్త ప్రధాని ఎన్నిక
పదవీ చ్యుతుడైన నవాజ్ షరీఫ్ స్థానంలో కొత్త ప్రధాన మంత్రిని పాకిస్తాన్ పార్లమెంటు మంగళవారం ఎన్నుకోనుంది. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలయిన కేసుల్లో సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సభా నాయకుడ్ని ఎన్నుకోవడం కోసం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆదేశించారు. మరో వైపు జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ కొత్త ప్రధాన మంత్రి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.













