పాక్ ప్రధానికి సుప్రీం షాక్
పాకిస్థాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాని నవాజ్ షరీఫ్‌పై జీవితకాల అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై వ్యతిరేకత ఉన్నా, షరీఫ్ తప్పుకున్నట్లు ప్రధానమంతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పనామా పత్రాల కేసులో సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ తమ తీర్పు వెలువరించింది. పార్లమెంట్‌ను, కోర్టులను మోసం చేశారని, ప్రధాని పదవి ఆయన అర్హులు కారని సుప్రీం కోర్టు సృష్టం చేసింది. ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులూ ఈ విషయంలో ఏకతాటిపై నిలవడం గమనార్హం.













