భారత్, అమెరికా కోసమే మాపై చర్యలు
అమెరికా, భారత్ కోసమే పాకిస్థాన్ ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటున్నదని ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధిపతి హఫీజ్ సయీద్ ఆరోపించాడు. చట్ట విరుద్ధంగా తీసుకుంటున్న చర్యలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని సృష్టం చేశారు. హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన పాక్ ప్రభుత్వం, అక్కడ అతడి స్థిరచరాస్తులను, బడులు, నాలుగు వైద్యశాలల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. చట్టపరమైన ఆధారాలు లేక పోవడం వల్లే నన్ను పదినెలల నిర్భందం తర్వాత వదిలిపెట్టారు. ఇప్పుడు మా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నది. పంజాబ్, బలూచిస్థాన్, సింధ్, ఆజాద కశ్మీర్ తదితర ప్రాంతాల్లో మేము అందిస్తున్న సహాయ సహకారాలకు ఆటంకం కలిగిస్తున్నది అని సయీద్ తెలిపారు.













