ముంబై పేలుళ్ల సూత్రధారి అరెస్టు స్వాగతించిన అమెరికా
కరడుగట్టిన ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు జైలుశిక్ష విధించడాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. లష్కరే తోయిబా నేరాలను నిరూపించడంలో ఇది ముందడుగని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ అధికారి అలైస్ జి వెల్స్ ట్వీట్ చేశారు. ముంబయి పేలుళ్లలో ప్రధాన నిందితుడైన సయీద్‌పై చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికాలు ఎంతో కాలం నుంచి పాక్‌ను డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాదానికి నిధులు చేరవేస్తున్నారన్న నేరాల కింద సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. సయీద్, అతనికి సన్నిహితుడైన జాఫర్ ఇక్బాల్‌కు 2 కేసుల్లో ఈ శిక్ష పడిరది.













