ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్
పెళ్లి చేసుకొని పరాయి దేశానికి తీసుకెళ్లి భార్యలను వేధించే ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్‌పెట్టనుంది. భార్యలను వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు చేయాలంటూ అత్యున్నతస్థాయి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తోంది.ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వేధిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వచ్చాయి. దీంతో ఇటువంటి మహిళల రక్షణకు సాధ్యమైనన్ని చట్టపరమైన మార్గాలను సూచించేందుకు మేలో కేంద్రం ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై అధ్యయనం చేసిన కమిటీ పలు సూచనలు చేసింది.













