ఎన్ఆర్ఐలకూ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ)లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు పొందాలనుకునే ఎన్ఆర్ఐలు ఇక నుంచి 182 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని.. పాస్‌పోర్టు ద్వారానే ఆధార్ కార్డును పొందవచ్చని ప్రభుత్వం సృష్టం చేసింది. ఎన్ఆర్ఐలకు ఆధార్‌ను సరళతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముందస్తు చేసుకునే అపాయింట్మెంట్ ద్వారా ఆధార్‌ను పొందవచ్చని యూఐడీఏఐ తెలియజేసింది. చెల్లుబాటయ్యే పాస్ పోర్టును గుర్తింపు కార్డుగా, అడ్రస్ ఫ్రూప్‌గా, బర్త్ సర్టిఫికెట్‌గా పరిగణలోకి తీసుకుంటామని యూఐడీఏఐ వివరించింది. ఒక వేళ ఎన్ఆర్ఐ పాస్‌పోర్టులో భారత్ అడ్రస్ లేకుంటే.. వేరే ఇతర పత్రాలను కూడా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా జులై 5న ఆర్థిక మత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ. ఇప్పటివరకు ఎన్ఆర్ఐలు భారత్‌లో అడుగుపెట్టిన 200 రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండేదాని.. ఫలితంగా 182 రోజుల పాటు ఆధార్ కార్డు కోసం వెయిట్ చేయాల్సి వచ్చేదని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధార్‌లోనూ మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.













