సరదాలకు తాత్కాలిక తెర
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడడంతో పాటు కుటుంబంతోనూ సరదాగా గడుపుతున్నారు. షికార్లు చేస్తున్నారు. మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియాల్లో క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లు జట్టును ఉత్సాహపరుస్తూ కనిపిస్తున్నారు. కోహ్లి భార్య అనుష్క ప్రధాన ఆకర్షణ. తమ విహారానికి సంబంధించిన ఫొటోలతో కోహ్లి సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాడు. కానీ ఈ సరదాలకు తాత్కాలికంగా తెరపడనుంది. ఆటగాళ్లు కనీసం నెల రోజుల పాటు తమ భాగస్వాములకు దూరంగా ఉండాల్సి వుంటుంది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు పూర్తయ్యేంత వరకు ఆటగాళ్లతో భార్యలు లేదా ప్రియురాళ్లు ఉండేందుకు అనుమతించబోమని టీమ్ మేనేజ్మెంట్ చెప్పినట్టు సమాచారం. తొలి టెస్టు ఆగస్టు 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది.













