వెయ్యికి నో చాన్స్
తాజాగా రూ.200 నోట్లు మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో రూ.1000 నోట్లు మళ్లీ చెలామణిలోకి రాబోతున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ, అలాంటిదేమీ లేదని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. వెయ్యి రూపాయల నోట్లను తిరిగి మార్కెట్లోకి తేవడంపై ప్రతిపాదనలు కూడా ఏమీ లేవని వెల్లడించింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గతేడాది నవంబర్లో కేంద్ర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కొత్త రూ.500, రూ.2000 నోట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇటీవల రూ.200 నోట్లు చెలామాణిలోకి రాగా, కొత్త రూ.50 నోట్లను కూడా ముద్రిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.













