లాక్ డౌన్ పొడిగింపు లేదు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రోజురోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కాలం పొడిగిస్తారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. లాక్డౌన్ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం సృష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. అలాంటి లాక్ డౌన్ పొడగింపు ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్డౌన్ పొడగించే యోచనేమీ లేదు అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సృష్టం చేశారు. అలాంటి వదంతుల్ని నమ్మొద్దు అని ఆయన ప్రజలకు విజప్తి చేశారు.













