ప్యాకేజీతో ఏపీ హ్యీపీ
ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్‌పై ప్రశ్నించగా, గతంలోనే నిర్ణయం జరిగిపోయింది కదా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చర్చ జరిపి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. ప్యాకేజీపై అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో లభించే ఫలాల కంటే ఎక్కువే ప్యాకేజీ ద్వారా కేంద్రం అందించింది అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశం ఇకపై ఉత్పన్నం కాదని తెలిపారు.













