రైలు ప్రయాణికులపై భారం
ఐఆర్సిటిసి రైల్వేల్లో ప్రయాణీకులకు కల్పించే ఉచిత బీమా సౌకర్యాన్ని వచ్చే సెప్టెంబరు ఒకటవతేదీనుంచి నిలిపివేస్తోంది. ఇకపై ప్రయాణీకులు రెండు ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వారు ప్రయాణబీమాతో టికెట్ కొనుగోలుచేస్తారా లేక బీమా లేకుండా కొనుగోలుచేస్తారా అన్న ఆప్షన్లు రెండింటిలో ఒకదానిని ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్సిటిసి ఇప్పటివరకూప్రయాణీకులకు ఉచిత ప్రయాణబీమా కల్పిస్తోంది. డిసెంబరు 2017నుంచి ఈ సౌకర్యాన్ని అమలుకు తెచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను ఆన్లైన్ప్రయాణీకులకు సైతం ఈ విధానం వర్తింపచేసింది. యూజర్లకు డెబిట్కార్డులతో కొనుగోలుచేసే వారికి టికెట్ బుకింగ్ చార్జిలనుసైతం మినహాయించింది.
ఇక ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి)ఈ ప్రయాణబీమాను అన్ని తరగతులకు వర్తింపచేసింది. బీమా గరిష్టంగా పదిలక్షల రూపాయలవరకూ ఉంటుంది. వినియోగదారులకుబీమా సౌకర్యం కల్పించేందుకుఐఆర్సిటిపి ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్సుందరం జనరల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందంచేసుకుంది. తిరుగులో ప్రతి ప్రయాణీకునికి 92 పైసలు చొప్పున బీమా సంస్థలకు రైల్వే కార్పొరేషన్ తరపున చెల్లిస్తుంది. ఇకపై వచ్చే సెప్టెంబరు ఒకటవ తేదీనుంచి ఈ విధానాన్ని రద్దుచేస్తోంది. ప్రయాణ ఖర్చులు ఇకపై ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది. అయితే ఎంతమొత్తం బీమా రూపంలోప్రయాణీకులు చెల్లించాలనేది ఇప్పటివరకూ ఐఆర్సిటిసి స్పష్టంచేయలేదు.













