ఎన్ఆర్సీపై కేంద్రం కీలక ప్రకటన
ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ కీలక ప్రకటన చేసింది. లోక్సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. ఇప్పటికైనా ఎన్ఆర్సీపై చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని కేంద్రం కోరింది. లోక్సభలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలను ప్రతిపక్షాలు అడ్డుకుంటూ ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. దీనికి సమాధానంగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈశాన్య రాష్ట్రాలతో మాత్రమే ఎన్ఆర్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీని అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ వెల్లడించింది.













