బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా
బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నితీశ్‌కుమార్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యవహారంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు తాను సాక్షిగా నిలవలేనని గవర్నర్‌తో చెప్పినట్లు సమాచారం. 2015 నవంబరులో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్ రెండేళ్లు కూడా ముగియకుండానే పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది.













