అఫ్గాన్‌కు బలగాలు పంపేది లేదు
అఫ్గానిస్థాన్‌కు భారత భద్రతా బలగాలు ఎట్టి పరిస్థితిలోనూ పంపేది లేదని భారత్ సృష్టం చేసింది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ శాఖ మంత్రి (అమెరికాలో భద్రతా కార్యదర్శి హోదో, ఇతర దేశాల విదేశాంగ శాఖ మంత్రితో సమానం) జేమ్స్ మట్టిస్తో, సీతారామన్ రెండు దేశాల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆఫ్గానిస్థాన్‌కు భారత్ మరింత సాయపడాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆమె చెప్పారు. భారత్ ఆ విధానాన్ని స్వాగతిస్తూనే ఆఫ్గాన్ పునర్ నిర్మాణంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే, సైనిక బలగాల తరలింపులో గత వైఖరినే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అఫ్గాన్‌కు మరింత సాయంమందించాలని భారత్‌ను అమెరికా కోరినప్పుడు బలగాలను పంపననడం సబబేనా? అని మాటిస్ వెంట వచ్చిన అమెరికా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సీతారామన్ దీటైన సమాధానమిచ్చారు.













