నిర్మలా సీతారామన్ కు రక్షణ మంత్రిత్వ శాఖ
సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన నిర్మలా సీతారామన్ కు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామనే. ప్రతిభ ఆధారంగానే తన కేబినెట్ లో సహాయ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చినట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖను సురేష్ ప్రభుకు కేటాయించారు. సురేష్ ప్రభు నిర్వహిస్తున్న రైల్వే శాఖను పియూష్ గోయెల్ కు కేటాయించారు.













