మూడో సారీ.. ఆగిన ఉరి
నిర్భయ కేసులో దోషుల ఉరి అమలు మరోసారి వాయిదా పడింది. దోషులను మంగళవారం (మార్చి 3వ తేదీ) ఉదయం ఉరి తీయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో నిరవధిక వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా చివరి నిమిషంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ దరఖాస్తు చేశాడు. దీనిపై నిర్ణయం తీసుకునేవరకు ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. దోషుల ఉరి వాయిదా పడటం ఇది మూడోసారి. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో దోషులకు డెత్ వారంట్లు జారీ అయ్యాయి. దోషులు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తుండటంతో ఉరి ఆలస్యం అవుతున్నది.













