నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలి…
నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్ష అమలు జాప్యం కావడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రివ్యూ పిటిషన్లపై జాప్యం జరిగిందని పేర్కొంది. నిర్భయ దోషుల మరణ శిక్షను వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తు కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఒకే కేసులో దోషులైన నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ క్రమంలో దోషులకు వారం రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. న్యాయపరమైన అంశాలను వారంలోగా పూర్తి చేసుకోవాలని సూచించింది.













